Monday, May 6, 2019

AMB Cinemas Watch Avengers Endgame Mahesh Babu

        ఆవెంజర్స్ ఎండ్ గేమ్ చూసిన మహేష్

        ఏఎంబీ సినిమాస్‌లో తొలి సినిమా చూశాను. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్’.. చాలా నచ్చింది. ఈ థియేటర్‌లో చూడటం మరింత చక్కని అనుభూతినిచ్చింది. థాంక్యూ ఏఎంబీ టీం. యూ గయ్స్‌ రాక్‌..’ అని పేర్కొంటూ టీంతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 

‘మహర్షి’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా టికెట్లు తనకే దొరకలేదని మహేశ్ చమత్కరించారు. ‘అందరూ ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ బాగుందని అంటున్నారు. ఆ సినిమా చూద్దామని ఏఎంబీ సినిమాస్‌లో టికెట్లు అడిగితే, ఏడు షోల వరకూ ఖాళీనే లేదని చెప్పారు. నేడో.. రేపో ఈ సినిమా చూస్తా’ అని అన్నారు. ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్న మహేశ్‌కు.. ఎట్టకేలకు ఈ సినిమాను చూసే సమయం దొరికింది. ఆయన కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags:  maheshbabu maharshi official trailer pooja hegde devisri prasad  amb cinemas 

No comments:

Post a Comment