సినిమాలు చూడను అంటున్నా నమ్రతా
మహేశ్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. ‘మహేశ్ సినిమాలు నేను చూడను (నవ్వుతూ). అది నన్ను చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. సామాన్య ప్రజలు లాగే కుటుంబ సభ్యులు కూడా ఆయన సినిమా ప్రివ్యూలకు వెళ్లి, ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, నేను ఇంట్లో కూర్చుని గోళ్లు కొరుకుతూ, దేవుడ్ని ప్రార్థిస్తుంటా. ఇది గత సినిమా కంటే బాగుంటుందా.. ఇలా ఆలోచిస్తూ ఉంటా. నిజంగా ఇది చాలా వేదనకు గురి చేస్తుంది. సంతోషంగా ఉండు, ఎక్కువ ఆలోచించొద్దు అని మహేశ్ చెబుతుంటాడు.. కానీ అది సాధ్యమయ్యే పని కాదు (నవ్వుతూ)’ అని ఆమె చెప్పారు.
Tags : maheshbabu maharshi namratha shirodkar

No comments:
Post a Comment