Saturday, May 18, 2019

Maharshi Team Visits Vijayawada

                మహర్షి టిమ్ విజయవాడ 

ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. అశ్వనీదత్‌, దిల్‌రాజు, పీవీపీ నిర్మాతలు. ‘మహర్షి’ విజయోత్సవం శనివారం రాత్రి విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ ‘‘రాజకుమారుడు’ చేసినప్పుడు తొలి పది రోజులు ఏం అర్థం కాలేదు. ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో తెలీదు. ఓ స్నేహితుడిలా చూసుకున్నారు రాఘవేంద్రరావు మావయ్య. ‘నువ్వు పెద్ద సూపర్‌ స్టార్‌ అవుతావు’ అని ఆరోజే అన్నారు. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి ఈ సినిమా చేయడం గర్వంగా ఉంది. కథ విన్నప్పుడే భారీ విజయం సాధిస్తుందని అనుకున్నా. డెహ్రాడూన్‌లో తొలి రోజు షూటింగ్‌ ముగిశాక ‘పోకిరి స్క్వేర్‌ అవుతుంది’ అన్నాను. ఈ సినిమాలో మూడు పాత్రలూ బాగా నచ్చాయి. అందులో విద్యార్థి పాత్ర మరింత కిక్‌ ఇచ్చింది. సినిమా నచ్చితే అభిమానులు ఏ స్థాయికి తీసుకెళ్తారో నాకు తెలుసు. నా గత చిత్రాల రికార్డులన్నీ ఒక్క వారంలో దాటించారు. చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంకేం చేయలేను’’ అన్నారు



Tags: maheshbabu maharshi official trailer pooja hegde Vijayawada 

No comments:

Post a Comment