Monday, May 6, 2019

Mahesh Babu Comment On Wife Namratha

                 నమ్రతా లేనిదే నేను లేను 

       మహర్షి’ సినిమా మే 9న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మహేశ్‌  ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కుటుంబం గురించి మాట్లాడారు. ‘మీ విజయంలో నమ్రతకు ఎంత క్రెడిట్‌ ఇస్తారు?’ అని ప్రశ్నించగా.. ‘నమ్రత నా బలం, నా వెన్నెముక, నా జీవితం, నా సక్సెస్‌, నా సంతోషం. ఓ విధంగా నేను సాధించినవన్నీ నమ్రత, పిల్లల కోసమే. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నమ్రత. నా పిల్లలకు ఇష్టమైన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. వారి తల్లిదండ్రులు నటీనటులు కాబట్టి నటనను ఎంచుకోమని బలవంత పెట్టడం సరికాదు’ అని అన్నారు.




Tags: maheshbabu maharshi movie  namratha 

No comments:

Post a Comment