Saturday, May 11, 2019

Thanks to Maharshi Big Success

 అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘ఇప్పటి వరకు నా ప్రయాణం చాలా ప్రత్యేకంగా జరిగింది. నా 25వ సినిమాను.. నా కెరీర్‌లో బిగ్‌ హిట్‌ చేసినందుకు ధన్యవాదాలు. సినిమాను ఎంతో ఆదరించిన నా అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన మీకు నా తరఫున, ‘మహర్షి’ చిత్ర బృందం, దర్శకుడు వంశీ పైడిపల్లి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు’ అని మహేశ్‌ పోస్ట్‌ చేశారు.


Tags   Mahesh Babu Pooja Hegde Naresh Devi Sri Prasad Music Dil Raju Aswanidutt PVP Vamsi Paidipalli  

No comments:

Post a Comment